Wednesday, November 27, 2019

నిద్ర  పట్టని  ఒక రోజు "జార్జి  రెడ్డి " మూవీ  ట్రైలర్ చూసా. ట్రైలర్ నచ్చి , ఎవరు  ఈ వ్యక్తి అని తెలుసుకోవడం మొదలుపెట్ట . తెలుసు కునే కొలది ఎదో ఆశ్చర్యం ,ఎదో అలజడి ఇంకెన్నో ప్రశ్నలు . 

ఆశ్చర్యం , ఒక వ్యక్తి ఒకే సమయం లో అపార మేధా సంపన్నుడు ,యోధుడు ,విప్లవకారుడు , అసమానతలని  ప్రశ్నించే స్వరం,  చెడు ని గద్దించే ధిక్కార స్వభావం , తోటి వారిని ప్రభావితం చేసే వాక్ ధాటి , నేనున్నా అని భరోసా ఇచ్చే ధైర్యం ,  "నా , నేనూ " అనే ఛట్రం లో తిరిగే సమాజం లో సమాజ మార్పు కోసం ఆలోచించే స్వభావం , గంభీర లోతయిన మనస్తత్వం  కలిగి అంతలోనే  దూకుడు తనం , అవమానం నుండో లేదా అవసరం నుండో కాకుండా ఆలోచన నుండి ఫైట్ చేసే ఒక వ్యక్తి  ఉండేవాడు? అని ఆశ్చరం . నాకు ఇన్ని రోజుల వరకు తెలీదా అని ఆశ్చరం . ఇప్పటికి తన స్నేహితులు ఆయనను ఇంతగా అభిమానిస్తారా అని ఆశ్చర్యం .  ఇలాంటి లక్షణాలు కలగలిపి వున్నా ఒక పాత్రని ని ఐతే రామాయణ ,భారత ,పురాణాల లో మరి ఎవర్ని వర్ణించి వుండరు . దేవుడో లేక పురాణ పురుషుడో ఐతే వీరుడో సూరుడో మేధావో అన్నారు కానీ అన్ని కలిపి ఐతే ఏమో మరి .

25 సంవత్సరాల వయసుకు ఒక నిర్దిష్టమయిన అభిప్రాయం తాను ఏమి చేయాలని .

అలజడి , ఇలాంటి వారు ఇక లేరా రారా అని అలజడి . ఇలాంటి వాళ్లు వున్నారని తెలిసి , నా వంతుగా  నేనేమి చేశా ఈ సమాజానికి అని అలజడి . నేను ఆ రోజుల్లో పుట్టి ఆయన కాలేజీ లో చదివి ఉండి ఉంటే బావుణ్ణు ,ఆ గర్వం ఆయన స్నేహితుల మాటల్లో చూసా ,ఇప్పుడు పుట్టి chacha అని అలజడి .

ప్రశ్నలు , అలాంటి వ్యక్తి ని అలా ఎలా చంపేశారు  :(  . అసూయ  తో ? ఓడిపోతామన్న భయం తో ? చరిత్ర మార్చే మనిషి చంపుతున్నాం అని తెలియని అమాయకత్వం తో ? అవమానం తో ? దేనికి ? ఆవేశం లో జరిగి ఉంటే తరువాత  ఐనా వాళ్లకి అర్థమయివుండి వుంటుందా వాలేమి చేసారని?

Thank you so much Pradeep garu,Damodar dev garu, Bharadwaja garu,Sailu garu,Jabbar garu for sharing your memories with us and made us to know about a great person in the history.